ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీసీసీ చీఫ్‌ అంశంపై వీహెచ్ మరోసారి హాట్ కామెంట్స్

ABN, First Publish Date - 2021-06-13T18:34:38+05:30

టీపీసీసీ చీఫ్ అంశం రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు పెడుతోంది. పీసీసీ అధ్యక్షుడి పేరు అధికారిక ప్రకటన త్వరలో ఉండనుందన్న వార్తల నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ అంశం రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు పెడుతోంది. పీసీసీ అధ్యక్షుడి పేరు అధికారిక ప్రకటన త్వరలో ఉండనుందన్న వార్తల నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఆదివారం నాటి ప్రకటనలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై మండి పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా అదృష్టం బాగుండి కొనసాగుతున్నాడని ఉత్తమ్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 


తెలంగాణలో పీసీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించడం లేదని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేస్తారా అని నిలదీశారు. పీసీసీ పీఠాన్ని బయట నుంచి వచ్చిన వారికి ఇస్తామంటున్నారని, ఇది జరిగితే తమ ఆత్మగౌరవం దెబ్బతినదా అన్నారు. మొదటి నుంచి ఉన్న వారి పరిస్థితి ఏంటన్నారు. పీసీసీని పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ అధినేత్రి సోనియా గాంధీకి తాను లెటర్ రాశానన్నారు. కాంగ్రెస్‌లో తనను సాగనంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయాల్లోకి తాను పదవుల కోసం రాలేదని, సోషల్ జస్టిస్ కోసం పని చేస్తున్నానన్నారు. బీజేపీలో జనరల్ సెక్రటరీలు రాష్ట్రానికి వస్తే వారి పార్టీ కోసం కష్టపడుతున్నారని, కానీ తమ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయరని విమర్శించారు.

Updated Date - 2021-06-13T18:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising