ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగిలో వరి సాగు చేయండి: ఉత్తమ్‌

ABN, First Publish Date - 2021-12-28T01:24:29+05:30

ఈ యాసంగిలో వరి సాగు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ యాసంగిలో వరి సాగు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. గత యాసంగిలో సుమారు 52 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు వీరంతా ఎటు పోవాలని  ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. రైతులు ఈ యాసంగిలో నిర్భయంగా వరి సాగు చేయాలని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని మోదీల వైఖరి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రైతుల గోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరితాడు అవుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-12-28T01:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising