భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు
ABN, First Publish Date - 2021-05-24T20:46:53+05:30
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు భూవివాదంలో చిక్కుకున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతంకుమార్‌పై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు భూవివాదంలో చిక్కుకున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతంకుమార్‌పై కేసు నమోదు చేశారు. 120బీ,166ఏ, 167, 168, 170, 171, 447, 468, 471, 307, 506 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాప్రాలో సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూవివాదంలో సుభాష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ భూవివాదంలో సుభాష్‌రెడ్డిపై తలదూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. సుభాష్‌రెడ్డి డబ్బు డిమాండ్ చేశారని మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
భూవివాదాలు టీఆర్‌ఎస్ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే మాజీమంత్రి ఈటెల రాజేందర్ భూ వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈటలపై మరో భూ కబ్జా ఫిర్యాదు వచ్చింది. ఈటల కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్ ముదిరాజ్ అనే వ్యక్తి తాజాగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తును ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Updated Date - 2021-05-24T20:46:53+05:30 IST