ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దన్న పాత్ర పోషిస్తా!

ABN, First Publish Date - 2021-08-20T09:17:55+05:30

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి తన వంతు పాత్ర పోషిస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. జల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కృషి చేస్తా 

ఇద్దరు సీఎంలతో తప్పకుండా చర్చిస్తా

త్వరలోనే రామప్పలో ఉన్నత స్థాయి భేటీ

భద్రాద్రి ఆలయం అభివృద్ధికీ కేంద్ర నిధులు

‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

‘భద్రాద్రి’ అభివృద్ధికీ కేంద్ర నిధులు

వరంగల్‌లోనూ సాంస్కృతిక కేంద్రం

‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి తన వంతు పాత్ర పోషిస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. జల వివాదాలతో పాటు ఇతర అంశాలను ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకుంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే వారితో తాను చర్చిస్తానని పేర్కొన్నారు.  ఈ మేరకు గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..


తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ముదురుతున్నాయి.. కేంద్ర మంత్రిగా పెద్దన్న పాత్ర పోషిస్తారా? 

తప్పకుండా పోషిస్తా. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. అన్ని రాష్ట్రాల్లో సమాంతర అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఏ వివాదమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మొన్నటి వరకూ కలిసి ఉన్న తెలుగు వారు, భౌగోళికంగా మాత్రమే విడిపోయారన్న సంగతిని ఇద్దరు సీఎంలూ గుర్తించాలి. జల వివాదాలతోపాటు ఇతర అంశాలపైనా కేంద్ర మంత్రిగా ఇద్దరు సీఎంలతో చర్చిస్తా. నదీ జలాల సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుందన్న విశ్వాసం ఉంది.


తెలంగాణలో టూరిజం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?

కరోనా కారణంగా టూరిజం రంగం బాగా దెబ్బతిన్నది. విదేశీ పర్యాటకులు రాకపోవడంతో కీలక పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు కరువయ్యారు. ఈ సవాల్‌ను అధిగమించడమే మా ముందున్న లక్ష్యం. తెలంగాణ పర్యటన తర్వాత ఢిల్లీలో సమీక్ష నిర్వహించి, ప్రత్యేక  కార్యాచరణ రూపొందించి అమలు చేస్తా.


హైదరాబాద్‌లో టూరిజం పరంగా ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందించారా?

ఇప్పటివరకైతే రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. త్వరలోనే రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహిస్తా. ఏయే ప్రాజెక్టులు తీసుకోవాలి అన్న అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తా.  


యునెస్కో గుర్తింపు లభించిన రామప్ప ఆలయ అభివృద్ధికి ఏం చర్యలు తీసుకోనున్నారు?

రానున్న రోజుల్లో రామప్ప ఆలయానికి విదేశీ పర్యాటకులు భారీగా వస్తారు. విమాన సౌకర్యంతోపాటు  అవసరమైన సదుపాయాలు కల్పించాల్సి ఉంది.  త్వరలో అక్కడ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తా. 


పురావస్తుశాఖ పరిధిలోని ఆస్తుల పరిరక్షణకు ఏం చర్యలు చేపట్టనున్నారు?

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు చారిత్రక ప్రదేశాలు పురావస్తు శాఖ పరిధిలో లేకపోవడంతో కేం ద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం కోల్పోయాం. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో దేశవ్యాప్తంగా 3,600 చారిత్రక కేంద్రాలు ఉండగా.. తెలంగాణలో కేవలం ఎనిమిదే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మిగతా వాటిని మా శాఖకు అప్పగిస్తే భావితరాల కోసం పరిరక్షిస్తాం. 


జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రాల ప్రతిపాదన ఏదైనా ఉందా?

హైదరాబాద్‌లో ఇప్పటికే ఒక సాంస్కృతిక కేంద్రం ఉన్నందున వరంగల్‌లో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో మరో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేస్తాం. సంగీత, నాటక, సాహిత, లలిత కళా అకాడమీలను మరింత పటిష్ఠం చేసే అంశంపైనా సమీక్ష నిర్వహిస్తా. బాసర ఆలయానికి కేటాయించినట్లుగానే తదుపరి దశలో భద్రాద్రి ఆలయానికి నిధులు ఇవ్వాలని ప్రతిపాదించాం. 


జన ఆశీర్వాద్‌ యాత్ర ముఖ్య ఉద్దేశమేంటి?

పార్లమెంట్‌లో విపక్షాల తీరును నిరసిస్తూనే జన ఆశీర్వాద్‌ యాత్ర చేపట్టాం. నా మంత్రిత్వ శాఖకు సంబంధించి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తున్నా. పేదలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం, కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాల పనితీరును తెలుసుకుంటున్నా. 


కేంద్ర మంత్రిగా సొంత గడ్డపై అడుగిడినప్పుడు ఎలాంటి అనుభూతి పొందారు?

అది మాటల్లో చెప్పలేను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ స్థాయి గౌరవం లభించిందంటే, అది రాష్ట్ర ప్రజల ఆశీర్వాదమే. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. కేబినెట్‌ మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా.  

Updated Date - 2021-08-20T09:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising