ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి

ABN, First Publish Date - 2021-01-18T04:49:45+05:30

ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి

సమావేశంలో మాట్లాడుతున్న చీమ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్‌ 


వడ్డెపల్లి, జనవరి 17: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డునపడ్డాయని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. హన్మకొండ వడ్డెపల్లి చర్చి జంక్షన్‌లోని ఎంజీపీ ఫంక్షన్‌హాలులో డాక్టర్‌ రామకృష్ణ, చుంచు రాజేందర్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడారు.  తెలంగాణ ఉద్యమంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఉద్యమకాలంలో, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను విస్మరించిందని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని విద్యా, వైద్య రంగాలు అభివృద్ధి జరిగి రైతులు బాగుపడతారనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయని అన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఉద్యమకారుల కోసం సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు శ్యాం, కోలా జనార్దన్‌గౌడ్‌, సాయిని నరేందర్‌, సోమ రామ్మూర్తి, డాక్టర్‌ చిర్ర రాజు, మంద వీరస్వామి, రౌతు రమేశ్‌కుమార్‌, నలిగంటి చంద్రమౌళి, మేకల రవి, మాధవి, అరూరి కుమార్‌, సావిత్రి  పాల్గొన్నారు. అనంతరం ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2021-01-18T04:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising