ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి కేసులో మరో ఇద్దరు అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-30T22:51:00+05:30

అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న కేసులో షిండే సహా మరో ఇద్దరిని పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న కేసులో షిండే సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 21 కోట్ల విలువైన గంజాయిని 141 సంచుల్లో ప్యాక్‌  చేసి రవాణా చేస్తున్నారు. ముంబై, పుణె, థానే ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్రలోని కొన్ని కాలేజీల్లో గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని తరలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం 4 వేల కిలోల గంజాయిని తరలిస్తున్న కేసులో 16 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అరెస్టైనవారు ఇచ్చిన సమాచారంతో ఓఆర్‌ఆర్‌ దగ్గర గంజాయిని స్వాధీనం  చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,500 కిలోల గంజాయి సీజ్ చేసి, 25 మందిని అరెస్ట్ చేశారు. 




నగర శివారులో భారీగా గంజాయి పట్టుబడిన సంగతి తెలిసిందే. గంజాయి డాన్ షిండేను అరెస్టు చేసిన ఎన్సీబీ.. దాదాపు రూ.21 కోట్ల విలువైన గంజాయిని  సీజ్ చేసింది.  షిండే కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. గంజాయి డాన్ షిండే కోసం ఆరు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. షిండే దక్షిణాది నుంచి ఉత్తరాదికి గంజాయి సరఫరా చేస్తుంటాడు. వైజాగ్ నుంచి వయా హైదరాబాద్ మీదుగా ముంబై, ఢిల్లీకి సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. కిలో గంజాయిని రూ.వెయ్యికి కొని లక్షల్లో అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు డాన్‌ షిండేకు సహకరిస్తున్న వారిపై ఎన్సీబీ నిఘా పెట్టింది.

Updated Date - 2021-08-30T22:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising