ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంపన్నవాగులో మునిగి అక్క, తమ్ముడి మృతి

ABN, First Publish Date - 2021-01-17T04:45:28+05:30

జంపన్నవాగులో మునిగి అక్క, తమ్ముడి మృతి

చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మేడారం, జనవరి 16 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగులో నీట మునిగి అక్కాతమ్ముడు మృతి చెందారు. మేడారం  పంచాయతీ పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన మెండు సంపత్‌రెడ్డి-అనిత దంపతులకు కుమార్తె జాహ్నవి (12), కొడుకు హేమంత్‌ (09) ఉన్నారు. అనిత సోదరి సునీత సమ్మక్క-సారలమ్మల మొక్కు తీర్చుకునేందుకు శనివారం కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి మేడారానికి రాగా చిన్నారులిద్దరూ వాళ్లతో కలిసి ఆలయ ప్రాంగణానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం అందరూ జంపన్నవాగు ఒడ్డున సేద తీరారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల సమయంలో వాగులో ఆడుకుంటున్న చిన్నారులిద్దరూ నీటి లోతులోకి వెళ్లి మునిగిపోయారు. తల్లిదండ్రులు, బంధువులు చూస్తుండగానే నీటిలో మునిగిపోతుండగా వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.  ఇద్దరు పిల్లలు మృత్యువాత పడడం స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. కళ్లెదుటే కన్నబిడ్డలిద్దరూ మరణించడంతో అనిత-సంపత్‌రెడ్డి దంపతులు గుండెలవిసేలా రోదించారు. 






Updated Date - 2021-01-17T04:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising