ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్భంగా పేలుడు కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-07-01T04:19:52+05:30

దర్భంగా పేలుడు కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్ట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దర్భంగా పేలుడు కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. నాంపల్లికి చెందిన ఇమ్రాన్‌ మాలిక్‌, నసీర్‌ మాలిక్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. సికింద్రాబాద్‌ నుంచి పార్సిల్‌ వెళ్లినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. నసీర్‌ ఖాన్‌ 2012లో పాకిస్తాన్‌ వెళ్లి ఎల్‌ఈటీలో శిక్షణ పొందాడని ఎన్‌ఐఏ  పేర్కొంది. రసాయనాలతో ఐఈడీ తయారీలో నసీర్‌ శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి నసీర్‌ మాలిక్‌ ఐఈడీ తయారు చేసాడంది.


 వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్‌- దర్భంగా రైలులో పార్సిల్‌ పంపారని ఎన్‌ఐఏ పేర్కొంది. రైలులో ఐఈడీ పేలి మంటలు వ్యాపించి ప్రాణనష్టం జరిగేలా కుట్ర పన్నారని ఎన్‌ఐఏ వివరించింది. లష్కరేతో ఇద్దరు సోదరులు ఇమ్రాన్‌ మాలిక్‌, నసీర్‌ మాలిక్‌ టచ్‌లో ఉన్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా భారీ కుట్రకు లష్కరే తోయిబా ప్లాన్‌ చేసినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. నిందితులను ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు.  


Updated Date - 2021-07-01T04:19:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising