ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు

ABN, First Publish Date - 2021-08-24T22:39:29+05:30

టీఎస్ ఆర్టీసీ సోమవారం సరికొత్త రికార్డుని నెలకొల్పింది. 78 శాతం ఒఆర్‌తో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ సోమవారం సరికొత్త రికార్డుని నెలకొల్పింది. 78 శాతం ఒఆర్‌తో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. ఆర్టీసీకి గణనీయంగా 23వ తేదీన రూ .13.04 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆర్టీసీ సిబ్బందిని, అధికారులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా రవాణా సేవలో టీఎస్ ఆర్టీసీ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా 23వ తేదీన 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఒ.ఆర్)తో రూ. 13.04 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు.



బస్సుల నిర్వహణ ద్వారా 78 శాతం ఒ.ఆర్ సాధించడం ఓ మైలురాయిగా నిలిచిందన్నారు. 31.77 లక్షల కిలోమీటర్లు బస్సులను నడిపి 41.05 ఇ.పి.కె (ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్) సాధించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనమని చెప్పారు. కరోనా వివత్కర పరిస్థితులు, డీజిల్ పెరుగుదల ఒకింత అవరోధాలుగా నిలిచినప్పటికీ ఆర్టీసీ తన గమ్యాన్ని కొనసాగిస్తూనే ఉందన్నారు. ప్రతి ఒక్కరి దిన చర్యలో ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి మరింతగా ఆదరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు.

Updated Date - 2021-08-24T22:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising