ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం...

ABN, First Publish Date - 2021-03-12T23:27:58+05:30

తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యూకేషన్ తన అధికారిక వెబ్‌సైట్ www.pgecet.tsche.ac.in లో తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీపీజీఈసెట్ఇ-2021) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యూకేషన్ తన అధికారిక వెబ్‌సైట్ www.pgecet.tsche.ac.in లో తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీపీజీఈసెట్ఇ-2021) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30. ఇందుకు సంబంధించిన ప్రవేశపరీక్షను జూన్ 19 న నిర్వహించనున్నారు.


ఎంఈఈ, ఎమ్‌టెక్, ఎంఫార్మా, ఎంఆర్క్, డిఫార్మ్ కోర్సులలో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆహ్వానిస్తోంది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, అభ్యర్థులు టీఎస్ పీజీఈసెట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికిగాను... అధికారిక వెబ్‌సైట్ ‘ pgecet.tsche.ac.in‌’ లోకి వెళ్లాలి. అప్లికేషన్ విండోపై ‌క్లిక్ చేయాలి. అభ్యర్థి పేరు, అవసరమైన వివరాలతో రిజిస్ట్రరవ్వాలి. టీఎస్‌పీజీఈసీఈటీ అడ్మిషన్ పోర్టల్‌లోకి లాగిన్ అయి దరఖాస్తును పూర్తి చేయాలి. ఎంచుకున్న కోర్సుకు సంబంధించి ఫీజు చెల్లించాలి. దీంతో దరఖాస్తు పూర్తవుతుంది. ఆ తర్మాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 

Updated Date - 2021-03-12T23:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising