ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారంలో వివరాలు ఇవ్వండి.. టీఎస్‌ విద్యాశాఖకు హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2021-06-23T22:45:02+05:30

వారంలో వివరాలు ఇవ్వండి.. టీఎస్‌ విద్యాశాఖకు హైకోర్టు ఆదేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు టీఎస్‌ విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా వివరణ ఇచ్చారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని హైకోర్టుకు సుల్తానియా వివరించారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగుతుందని తెలిపారు. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాన్నీ దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు రూపొందిస్తామని సుల్తానియా తెలిపారు. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యాశాఖకు టీఎస్‌ హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-06-23T22:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising