ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్య నటుడు వివేక్ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం: ఎంపీ సంతోష్

ABN, First Publish Date - 2021-04-17T19:09:14+05:30

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచారకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచారకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేక్ గొప్ప ప్రకృతి ప్రేమికుడని కొనియాడారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం విచారకరమన్నారు. వివేక్ లక్ష్యం అర్ధంతరంగా ఆగిపోకుండా మిగతా 68 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించి, పూర్తి చేస్తామని జోగినపల్లి సంతోష్ ప్రకటించారు. ప్రకృతి ప్రేమికుడు వివేక్ లక్ష్య సాధనే ఆయనకు అసలైన నివాళి అని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. వివేక్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతోషం కుమార్ ట్వీట్ చేశారు.





Updated Date - 2021-04-17T19:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising