ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-17T20:43:19+05:30

తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సభలో ధాన్యం సేకరణ,  సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణతో పాటు కేంద్ర వైఖరిపై అనుసరించాల్సిన తీరుపై టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్రంపై పోరు భవిష్యత్తు కార్యచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహరచన చేయనున్నారు. పార్టీ నిర్మాణంపై  కూడా ఈ సమావేశంలో కేసీఆర్ సూచనలు అందించనున్నారు. అలాగే రైతుబంధుపై  కేసీఆర్ అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ నెల 19 నుంచి సీఎం కేసీఆర్ పర్యటనలు విజయవంతం చేసేలా పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. దళితబంధుపై ప్రతిపక్షాల ప్రచారం, ప్రజల్లో అనుమానాలను తిప్పికొట్టేలా నాయకులకు కార్యకర్తలకు కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-17T20:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising