ఆ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు
ABN, First Publish Date - 2021-02-01T05:20:51+05:30
ఆ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు
కాంగ్రెస్, బీజేపీపై టీఆర్‌ఎస్ నేత రాజయ్య ఫైర్
కృష్ణకాలనీ, జనవరి 31: పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్, బీజేపీకి లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి రాజయ్య యాదవ్ వ్యాఖ్యానించారు. భూపాలపల్లిలోని మంజూర్‌నగర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీస అవగాహన లేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారన్నారు. యాధృచ్ఛికంగా బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడిగా ఎంపికైన బండి సంజయ్ టీఆర్‌ఎస్‌పై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని పదేపదే అనడం హేయమైన చర్య అన్నారు. మరోమారు అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేంది లేదని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించేందు కు పట్టభద్రులంతా సుముఖంగా ఉన్నారన్నారు. అనుకున్న దానికన్నా అధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చే శారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను కేంద్రపభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. రైతులను తిప్పలు పెట్టిన ప్రభుత్వాలు మనుగడ సాధించ లేదని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరం తరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్‌పర్సన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌కుమార్, టీఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-01T05:20:51+05:30 IST