ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండుగలా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

ABN, First Publish Date - 2021-02-27T05:34:40+05:30

పండుగలా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

సభ్యత్వ నమోదులో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నయీంనగర్‌, ఫిబ్రవరి 26 : టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పండుగలా కొనసాగుతుందని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హన్మకొండ 44వ డివిజన్‌లోని ఫైన్‌ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సోదా కిరణ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ హాజరై సభ్యత్వ నమోదును  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరికి రూ.2 లక్షల భీమా సౌకర్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ అనిశెట్టి సరిత, 44వ డివిజన్‌ అధ్యక్షుడు కందికొండ వేణు, నాయకులు పులి సారంగపాణి, తాళ్లపెల్లి జనార్ధన్‌గౌడ్‌, రాచమల్ల రవీందర్‌, పుప్పాల ప్రభాకర్‌, గుంటి శ్రీనివాస్‌, పైడిపాల అశోక్‌ పాల్గొన్నారు.

 హన్మకొండ 45వ డివిజన్‌ రాంనగర్‌లో శుక్రవారం మునిసిపల్‌ కో-ఆప్షన్‌ మెంబర్‌ మేకల బాబురావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ 45వ డివిజన్‌ అధ్యక్షుడు అశోక్‌, జిల్లా నాయకులు ఖాసీం, విజయ్‌, సత్తార్‌ పాల్గొన్నారు.

 హన్మకొండ 44వ డివిజన్‌ పోచమ్మకుంటలో 30 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ నాయకులు సోదా కిరణ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ వారిని టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవిందుల ప్రేమ్‌ కుమార్‌, సతీష్‌ ఠాకూర్‌, వేమునూరి వెంకట్‌, వంకంటి నరేష్‌ పాల్గొన్నారు.

 రెవెన్యూ కాలనీ: టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని జూలైవాడలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా పశ్చిమ నియోజకవర్గం ఉండేందుకు కృషి చేస్తామన్నారు. 

శంభునిపేట: 7వ డివిజన్‌లోని ఉర్సు హరిజన వాడలో కార్పొరేటర్‌ కేడల పద్మజనార్ధన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఈదుల రమేష్‌, అన్వే్‌షల  ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు చేపట్టారు. 

Updated Date - 2021-02-27T05:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising