ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్చకు సిద్ధమా?.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

ABN, First Publish Date - 2021-10-26T01:01:15+05:30

ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, విద్యార్థులకు స్కాలర్ షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై చర్చకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. 


‘‘ఓయూకు ఎంత నిధులు కేటాయించారో చర్చించుకుందాం రండి. యువత‌ను ఉద్యోగాలు ఇవ్వక పోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో లక్షా 7 వేల ఖాళీలున్నాయని చెప్పారు. బిశ్వల్ కమిటీ రిపోర్ట్ కూడా లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీ లున్నాయని చెప్పింది. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ, నిరుద్యోగుల సమస్యలపై చర్చిద్దమా?. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంత కలిసి పోరాటం చేశారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎందుకు తొలగించడంలేదు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్, కేసీఆర్‌పై పెట్టిన కేసులు తొలగించుకున్నారు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడంలేదు. తొలి, మలి దశలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎందుకు న్యాయం చేయడం లేదు.1500 కుటుంబాలను ఆదుకుంటామని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. గుర్తించిన 500 కుటుంబాలకు కూడా సరైన న్యాయం చేయలేదు. కొందరు అడ్రస్ లేరని రాశారు. ఎంత అన్యాయం.’’ అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-10-26T01:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising