ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో స్వేచ్ఛలేదు: రేవంత్‌

ABN, First Publish Date - 2021-09-18T02:36:31+05:30

రాష్ట్రంలో స్వేచ్ఛలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆధ్యర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్: రాష్ట్రంలో స్వేచ్ఛలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆధ్యర్యంలో సీఎం ఇలాకా గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేటీఆర్ కుటుంబానికే అన్ని పదవులు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని కేసీఆర్ అన్నారని, మాట ఇచ్చి కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని రేవంత్‌రెడ్డి  ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చకుండా పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు.


 పేదలకు విద్యను దూరం చేసిన మహనీయుడు కేసీఆర్‌ అని ఆయన అన్నారు. దళితబంధు నిధులు ఎప్పుడు కేటాయిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో 14 గ్రామాల ప్రజలను కేసీఆర్‌ అనాథలను చేశారన్నారు. తెలంగాణ అంటే దొరల గడీలను బద్దలుకొట్టిన గడ్డ అని ఆయన అన్నారు. ఈ సభకు రాహుల్‌గాంధీ రావాల్సిందని, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారని రేవంత్ తెలిపారు. 

Updated Date - 2021-09-18T02:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising