ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ను సరైన సమయంలో టచ్ చేస్తాం: బండి సంజయ్

ABN, First Publish Date - 2021-11-09T22:55:04+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను సరైన సమయంలో టచ్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగిన బీజేపీ డప్పు మోత కార్యక్రమంలో సంజయ్ మాట్లాడారు. కేసీఆర్‌ను సరైన సమయంలో టచ్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. దళితబంధు అమలు చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుదని బండి సంజయ్ హామీ ఇచ్చారు. దళితులకు రూ. 10 లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదని సంజయ్ హెచ్చరించారు. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా? అని ఆయన ప్రశ్నించారు. దళితబంధు కావాలో.. వద్దో ఎస్సీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని సంజయ్ సూచించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టిన రోజు కేసీఆర్ ఎందుకు సభలో లేడు? అని ఆయన ప్రశ్నించారు. వర్షకాలంలో పండిన వరి ధాన్యాన్ని కొంటాడో లేదో కేసీఆర్ చెప్పాలని, కేసీఆర్ బూతు మాటలు విని తెలంగాణ సమాజం తల దించుకుంటోందని సంజయ్ అన్నారు. పేదల కోసం కేసీఆర్‌తో తల‌ నరుక్కోవటానికి తాను సిద్ధమని, కేసీఆర్ సిద్ధమా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నానని, అంబేడ్కర్‌ విగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-09T22:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising