ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఠా రెత్తిస్తున్న ‘ టమాటా’ ధర

ABN, First Publish Date - 2021-10-11T21:57:17+05:30

సామాన్య ప్రజలు ఎంతో ఇష్టపడి తినే టమాటా ధరలు కంగు తినిపిస్తున్నాయి. చూస్తుండగానే ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సామాన్య ప్రజలు ఎంతో ఇష్టపడి తినే టమాటా ధరలు కంగు తినిపిస్తున్నాయి. చూస్తుండగానే ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. వారం పది రోజుల క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కిలో 15 నుంచి 20 రూపాయలు పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా 60 రూపాయలకు చేరింది. కాస్త నాణ్యతతక్కువగా ఉన్నదైతేకిలో 50 రూపాయలకు అమ్ముతున్నారు. నిత్యం ఏదో ఒక కూరలో తప్పని సరిగా వినియోగించే టమాటా ధర పెరిగిపోవడానికి కారణం ఏంటని సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే వ్యాపారులు మాత్రం మార్కెట్‌కు దిగుమతులు తగ్గడమే కారణమని చెబుతున్నారు. ప్రత్యేకించి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో టమాటా పంట పాడైపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రోజువారీగా హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలి వచ్చే టమాటాలో ప్రస్తుతం 50శాతానికి పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. 


ముఖ్యంగా తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలల నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు టమాటా దిగుమతి అవుతుంది. అలాగే బెంగళూరు, మహారాష్ట్ర, రాజస్ధాన్‌ నుంచి కూడా హైదరాబాద్‌కు టమాటా దిగుమతి జరుగుతోంది. అయితే సాఽధారణ రోజుల్లో అయితే నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లు, రైతుబజార్‌లకు రోజుకు 150 నుంచి 180 లారీల టమాటా తరలి వస్తుండగా, ప్రస్తుతం 80 లారీలుకూడా రావడం లేదని నగరంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ అయిన గుడిమల్కాపూర్‌లోని వ్యాపారి వెంకటేశ్వరరావు తెలిపారు. మార్కెట్‌కు తరలి వస్తున్న టమాటా కూడా నాణ్యతతో  రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. పంట పూర్తిగా చేతికి రాకముందే వర్షాలకు రాలిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కొత్త పంట చేతికి వచ్చే వరకూ  మరో రెండు నుంచి మూడు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-11T21:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising