ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-10-19T08:26:07+05:30

లక్ష్మీనృసింహుడి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉద్ఘాటన తేదీలు ప్రకటించే చాన్స్‌.. 
  • పనులపై అధికారులతో సమీక్ష
  • గడువులోగా పూర్తి చేసేలా దిశానిర్దేశం

యాదాద్రి/హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): లక్ష్మీనృసింహుడి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యటనపై ఇప్పటివరకు అధికారిక షెడ్యూల్‌ విడుదల కానప్పటికీ... ఉదయం 11.30గంటలకు హైదరాబాద్‌ నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఈ మేరకు టెంపుల్‌ సిటీ సమీపంలోని హెలీప్యాడ్‌ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఆలయంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. నవంబరు లేదా డిసెంబరులో యాదాద్రి ఆలయ ఉద్ఘాటన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఇందులో భాగంగానే ఇటీవల ముచ్చింతలలో చినజీయర్‌ స్వామిని కలిసిన సీఎం.. ఆలయ ఉద్ఘాటనపై చర్చించి ముహుర్తాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. ఆ వెంటనే గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైటీడీఏ అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం యాదాద్రిలో పనుల పురోగతిని కేసీఆర్‌ పరిశీలించనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు చినజీయర్‌ స్వామి నిర్ణయించిన తేదీలను, మహా సుదర్శన యాగం తేదీలను స్వయంగా సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రకటించనున్నారు.

Updated Date - 2021-10-19T08:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising