ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పీవీ శత జయంతి ముగింపు వేడుకలు

ABN, First Publish Date - 2021-06-28T08:58:49+05:30

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ముగింపు వేడుకలకు భారీ సన్నాహాలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్ఞాన భూమి వద్ద గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ నివాళులు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ముగింపు వేడుకలకు భారీ సన్నాహాలు చేసింది. నెక్లె్‌సరోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం పీవీ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతోంది. పీవీ జ్ఞానభూమి వద్ద నిర్వహించే శత జయంతి వేడుకల్లో గవర్నర్‌ తమిళసై సీఎం కేసీఆర్‌ పాల్గొని నివాళులర్పిస్తారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరాభవన్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పీవీ శత జయంతి ముగింపు వేడుకల్లో జూమ్‌ ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రసంగిస్తారు. ఆర్థిక సంస్కరణల రూపకర్త, రాజనీతిలో అపరచాణక్యుడిగా అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు అందుకున్న తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు ప్రధానిగా దేశానికి అందించిన సేవలను చిరస్మరణీయంగా తలుచుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నేటి రాజకీయాల్లో ప్రధానంగా యువతలో పీవీ రాజకీయ స్ఫూర్తిని నింపేందుకు వీలుగా ఏడాది పాటు వివిధ రకాల సభలు, సమావేశాలు, చర్చాగోష్ఠులు, తదితర కార్యకలాపాలను దేశ విదేశాల్లో నిర్వహించారు.


సంస్కరణల పితామహుడు పీవీ: దత్తాత్రేయ 

పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణల పితామహుడు అని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. ‘1991లో దేశం ఆర్థిక సంక్షోభంతో పతనం అంచుకు దిగజారిన క్లిష్టమైన సమయంలో పీవీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. తన చతురత, పరిపాలనా సామర్థ్యంతో, నూతన  ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థికంగా ప్రగతి పథాన నడింపించిన ఘనత  పీవీదే’ అని అన్నారు.  పీవీ శత జయంతి సందర్భంగా ఆదివారం మీడియాకు ఆయన తన సందేశాన్ని విడుదల చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ నిర్వహించిన ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పీవీ తనయుడు ప్రభాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కన్వీనర్‌ మహేష్‌ బిగాల పాల్గొన్నారు.

Updated Date - 2021-06-28T08:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising