ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరికి చెప్పాలె.. ఎంతని తిరగాలె..

ABN, First Publish Date - 2021-08-29T09:16:24+05:30

ఇది ఒకరిద్దరి సమస్య కాదు. రాష్ట్రంలో సుమారు 25 శాతం మంది రైతులు రోజూ పడుతున్న వేదన.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘ధరణి’లో భూమి రిజిస్టర్‌ కాదు.. కట్టిన పైసలు రావు
  • విక్రయదారు చనిపోతే ఇరుక్కుపోయినట్లే
  • రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకుంటే.. సొమ్ము రాదు
  • ‘అసైన్డ్‌ వారసత్వ బదిలీ’లోనూ ఇక్కట్లు
  • ఆప్షన్‌ ఇచ్చినా అంగీకరించని ధరణి
  • తహసీల్దార్ల చుట్టూ రైతుల చక్కర్లు
  • అసైన్డ్‌ సమస్యలపై 76 వేల అర్జీలు పెండింగ్‌


  • ‘నా పేరు మల్లయ్య. భూపాలపల్లి జిల్లాలోని జంగేడు. మా ఊరిలోని 784 సర్వే నంబరులో చిన్న మల్లయ్య అనే వ్యక్తి నుంచి 0.39 ఎకరాల భూమిని మహేందర్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. మహేందర్‌కు మ్యాన్యువల్‌ 1-బి, మ్యాన్యువల్‌ పాసు బుక్‌ ఉంది. కానీ ఆన్‌లైన్‌ మ్యుటేషన్‌ చేయించుకోలేదు. అతడి వద్ద నుంచి 2014లో నేను భూమి కొన్నా. కాస్తు కాలమ్‌లో, కబ్జాలో నేనే ఉన్నాను. కానీ మ్యుటేషన్‌ చేయించుకోలేదు. ఇప్పుడు మ్యుటేషన్‌ చేయుంచుకునేందుకు ధరణిలో స్లాట్‌బుక్‌ చేసుకుంటే.. ఆ భూమి చిన్న మల్లయ్య పేరు మీద చూపిస్తోంది. ఆయన చనిపోయారు. వారసులు లేరు. భూమి నా పేర నమోదు కావాలంటే ఏం చేయాలి. నా సమస్యను ఎవ్వరికి చెప్పుకోవాలి?’’

  • భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో 4 ఎకరాల భూమి కొనేందుకు ఒప్పందం కుదుర్చుకొని స్లాట్‌బుక్‌ చేసుకున్నా. కానీ ఆ భూమిపై పలు వివాదాలున్నాయని తెలిసి స్లాట్‌ రద్దు చేసుకున్నా. అయితే, చెల్లించిన 38 వేలు ఇవ్వడం లేదు. అధికారులు మాకు తెలియదు అంటున్నారు. సమస్య ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. 
  • -  ఓ మహిళా రైతు ఆవేదన   

’

ఇది ఒకరిద్దరి సమస్య కాదు. రాష్ట్రంలో సుమారు 25 శాతం మంది రైతులు రోజూ పడుతున్న వేదన. అన్నదాతల సమస్యలను తీర్చుతుందనుకున్న ధరణి వారికి భూమి మీద హక్కునే లేకుండా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వస్తే లంచాల బెడద తగ్గుతుందని భావించామని, కానీ ఏకంగా తమ భూ హక్కులను, చెల్లించిన సొమ్మును కోల్పోతామని అనుకోలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా ఏదేని సంస్కరణలు అమలు చేస్తే మొదట్లో ఇబ్బందులు రావడం సహజం. కానీ ధరణి అమల్లోకి వచ్చి 10 నెలలు పూర్తి కావస్తోంది. అయినా నేటికీ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది బాధితులు ఉన్నారని రెవెన్యూ అధికారులే బహిరంగంగా పేర్కొంటున్నారు. గతంలో స్టాంపు డ్యూటీ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే.. స్టాంపు డ్యూటీ ఫీజులో 10శాతం సొమ్మును సర్వీసు చార్జీల కింద తీసుకుని, మిగిలింది ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. డబ్బులు ఇస్తామని కొందరు.. మాకు తెలియదు అని ఇంకొందరు.. మీరు చెల్లించిన దగ్గరే అడగండి.. అని మరికొందరు అధికారులు చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే గతంలో భూమిని విక్రయించిన వ్యక్తి చనిపోతే.. సేల్‌డీడ్‌ ఆధారంగా రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి భూమిపై స్థానిక, సమీప రైతుల సమక్షంలో పంచనామా చేసి, ఆ భూమిని కొనుగోలు చేసిన రైతు పేర నమోదు చేసేవారు. 


ప్రస్తుతం.. గతంలో కొనుగోలు చేసిన భూముల సంగతి అలా ఉంచితే.. ఈ రోజు భూమి విక్రయించి స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు విక్రయదారుడు చనిపోతే.. రూ.లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తికి ఎలాంటి హక్కులు లేకుండానే పోతున్నాయని, ఇలాంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. కాగా, కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా, లేకున్నా స్లాట్‌ బుక్‌ చేసుకుంటే  రిజిస్ట్రేషన్‌ చేసేలా అసైన్డ్‌ భూములపై వారసత్వ బదీలీలకు 22న ధరణి పోర్టల్‌లో ఆప్షన్‌ ఇచ్చారు. కానీ అసైన్డ్‌ భూములు రిజిస్ట్రేషన్‌ నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో ధరణిలో స్లాట్‌కు అవకాశం కల్పించిన ట్లు ప్రభుత్వం చెబుతున్నా, వారసుల వివరాలను నమోదు చేయగానే ఈ భూమి వివరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు ధరణిలో దర్శనమిస్తోంది. దీంతో అసైన్డ్‌దారులు ఇటు మీ సేవ.. అటు తహసీల్‌ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. 


తహసీల్దార్లకు తలనొప్పి

రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది రైతులు అసైన్డ్‌దారులుగా ఉన్నారు. వీరిలో సుమారు 80శాతం మంది భూములు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. ఈ సమస్యలపై ఇప్పటి వరకు సుమారు 76 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలతో వస్తున్న రైతులకు సమాధానం చెప్పలేక తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

Updated Date - 2021-08-29T09:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising