ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా విస్కాన్సిన్‌ వర్సిటీ అధ్యాపకుడిగా జిల్లా వాసి

ABN, First Publish Date - 2021-05-20T05:44:53+05:30

అమెరికా విస్కాన్సిన్‌ వర్సిటీ అధ్యాపకుడిగా జిల్లా వాసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న తిరుపతి

  మల్హర్‌, మే 19 : భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన రావుల తిరుపతి అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌లో అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌గా ఎంపికయ్యారు. రాజారాం, వినోద  కుమారుడైన తిరుపతి ఐదేళ్లుగా ఆ యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉన్నారు. ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న ఆయన ఎనిమిది, తొమ్మిదో తరగతులు కరీంనగర్‌లో, పదో తరతగి మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. మంచిర్యాలలో ఇంటర్‌ చేసిన తిరుపతి  జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. అనంతరం కరీంనగర్‌లో బీఎ్‌ససీ(ఎంపీసీ)  చేసి 93శాతం మార్కులు సాధించారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ను పాండిచ్చేరి రాష్ట్రంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో చేసి టాపర్‌గా నిలిచారు. గేట్‌ పరీక్షలో 99.8 శాతం మార్కులు సాధించి దేశ వ్యాప్తంగా 42 ర్యాంకును సాధించారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ సైన్స్‌లో బయోనానో టెక్నాలజీ విభాగంలో పీహెడ్‌డీకి అర్హత సాధించారు. సింగపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ నానో టెక్నాలజీ సదస్సులో భారతదేశంలో నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టరేట్‌ ఫెలోషి్‌పనకు ఎంపికయ్యారు. నాలుగేళ్లపాటు పీడీఎఫ్‌ పరిశోధన పూర్తి చేశారు. విస్కాన్సిన్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నియామకానికి వివిధ దేశాల నుంచి వందలాది మంది పోటీ పడగా చివరికి ఆ అవకాశం తరుపతికి దక్కింది. ఆయన నియామకం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-05-20T05:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising