ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయానికి తారతమ్యాలు లేవు..

ABN, First Publish Date - 2021-10-17T06:42:38+05:30

న్యాయానికి తారతమ్యాలు లేవు..

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పేద, ధనిక తేడా ఉండదు..

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు

కృష్ణకాలనీ/రేగొండ, అక్టోబరు 16: న్యాయస్ధానం దృష్టిలో అందరూ సమానమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు అన్నారు. పేద, ధనిక తారతమ్యాలు ఉండవన్నారు. ఉచిత న్యాయ సేవలపై భపాపాలపల్లి, రేగొండలో శనివారం నిర్వహించిన అవగాహన సద స్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఆర్థిక స్థోమత, మరే తర బలహీనతల కారణాల వల్ల ఏ ఒక్కరూ న్యాయాన్ని పొందే అవకా శాన్ని కోల్పోవద్దన్నారు. ఇందుకు ప్రభుత్వం ఉచితంగా న్యాయ సేవలు అందిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళలు, పిల్లలు, మతిస్థితిమితం లేనివారు, దివ్యాంగుల తోపాటు సామూహిక విపత్తులు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టికి గురైన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందొచ్చ న్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.వి.మహేష్‌, రేగొండ ఎస్సై కృష్ణప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భద్రయ్య, భూపాలపల్లికి చెందిన అడ్వకేట్లు వి. శ్రీనివాసాచారి, సింగం రవీందర్‌, ఎస్‌.కె. మొయినొద్దీన్‌,  కె. చిరంజీవి, రేగుల రాకేష్‌, ఎం.డి. లతీఫ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-17T06:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising