ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌లో అదిరిపోతున్న ఎండలు!

ABN, First Publish Date - 2021-04-05T09:12:48+05:30

నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్‌ నెలలోనే మాడు అదిరిపోయే ఎండలు కొడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పదేళ్లుగా 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదు
  • ఈసారి ఆల్‌ టైం రికార్డు దాటే అవకాశం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్‌ నెలలోనే మాడు అదిరిపోయే ఎండలు కొడుతున్నాయి. ప్రతి రోజూ సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ప్రతి ఏటా ఏప్రిల్‌ చివరి వారంలో నగరంలో ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఈసారి మార్చి నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. గత పదేళ్ల వాతావరణ శాఖ రికార్డులను పరిశీలిస్తే.. ఏప్రిల్‌లో రోజుకు సగటున 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో ఉష్ణోగ్రతలు 40 ఏళ్ల ఆల్‌టైం రికార్డును దాటే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 0.9 కి.మీ వద్ద ఉత్తర-దక్షిణ ఆవర్తనం ఏర్పడినందున ఎండతీవ్రత పెరిగిందన్నారు. 


ఏప్రిల్‌ రెండో వారం నుంచి మే చివరి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతల ప్రభావం బాగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర పనులకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. శనివారం నగరంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని దీనిని బట్టి చూస్తే.. 1973 ఏప్రిల్‌ 30న నమోదైన 43.3 డిగ్రీల ఆల్‌ టైం రికార్డును ఈ నెలలో దాటే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఆదివారం అత్యధికంగా నారాయణగూడ, గన్‌ఫౌండ్రీలో 38.7 డిగ్రీలు, కుషాయిగూడ, మల్లాపూర్‌ బయోడైవర్సిటీ, రాజీవ్‌నగర్‌, మౌలాలి, కాప్రాలో 38.3, సర్దార్‌మహల్‌, సికింద్రాబాద్‌, డబీర్‌పురా, ఖైరతాబాద్‌ గణాంకభవన్‌లో 38.2, లింగోజీగూడలో 38.1, అల్వాల్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా నగరంలో సగటున 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.



Updated Date - 2021-04-05T09:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising