ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్బులపై హైకోర్టు సీరియస్

ABN, First Publish Date - 2021-12-22T23:36:34+05:30

నగరంలో నిబంధనలు ఉల్లంగిస్తున్న పబ్బులుపై హైకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్బులపై హైకోర్టు సీరియస్ అయింది. 9 పబ్బులకు హైకోర్టు నోటీసులను జారీ చేసింది. పబ్బులతో పాటు హైదరాబాద్ కమిషనర్, తెలంగాణా ప్రభుత్వాన్ని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 2000 నిబంధలు ఉల్లంఘించారని కోర్టుకి పిటిషనర్ తెలిపారు. మధ్య రాత్రి వరకు అధిక శబ్దంతో పబ్బులు నడుపుతున్నారని వాదించారు. దీంతో అక్కడ నివసించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రెసిడెన్షియల్ అసోషియేషన్ తెలిపింది. నిబంధనలు ఉల్లంగించిన పబ్బులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.


800 జూబ్లీ , హైలైఫ్ బ్రెవింగ్ కంపనీ , ఫర్జీ కెఫె , అమ్నిషియా లాంజ్ బార్ , డైలీ డోస్ బార్ హప్, డర్టీ మార్టిని కిచెన్ అండ్ కాక్ టాయిల్ లాంచ్ , బ్రాడ్ వే పబ్ , మ్యాకే బ్రో వరల్డ్ కాపీ బార్ , హార్ట్ కప్ కాపీ పబ్బులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఈ నెల 29 లోపు  కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్ , తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. 


కాగా పబ్‌ల అరాచకాలపై జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 31లోగా పబ్‌లను కట్టడి చేయాలని సూచించింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో పబ్‌లకు అనుమతి ఇస్తున్నారంటూ.. దాన్ని సవాల్ చేస్తూ దాకలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పబ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ పది పబ్‌లు పూర్తి స్థాయిలో నివాసిత ప్రాంతాల్లో ఉన్నాయని, పబ్లిక్‌కు చాలా ఇబ్బందిగా మారిందని, అ పబ్‌లకు ఏ విధంగా అనుతిచ్చారో.. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది.

Updated Date - 2021-12-22T23:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising