ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దిశ’ సినిమా కేసు మరో మలుపు

ABN, First Publish Date - 2021-06-15T09:06:52+05:30

సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఆధారంగా సినిమా తీయకుండా దర్శకుడు రాంగోపాల్‌ వర్మను నియంత్రించాలని కోరుతూ ‘దిశ’ తండ్రి హైకోర్టులో దాఖ లు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దానికి వర్మ దర్శకుడు కాదు 
  • రెండు వారాలపాటు విడుదల చేయం 
  • హైకోర్టుకు నిర్మాత తరఫున హామీ
  • వ్యాజ్యం విచారణను మూసేసిన బెంచి


హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఆధారంగా సినిమా తీయకుండా దర్శకుడు రాంగోపాల్‌ వర్మను నియంత్రించాలని కోరుతూ ‘దిశ’ తండ్రి హైకోర్టులో దాఖ లు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ సినిమాకు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించలేదని నిర్మాత తరఫు న్యాయవాది కె. దుర్గాప్రసాద్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ చిత్రాన్ని ఆనంద్‌చంద్ర దర్శకత్వంలో అనురాగ్‌ కంచర్ల నిర్మించారని ఆయ న తెలిపారు. వర్మ నుంచి కథాంశాన్ని మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు. ‘ఆశ ఎన్‌కౌంటర్‌’ పేరుతో చిత్ర నిర్మా ణం జరిగిందని, దీన్ని 9 మంది సభ్యులతో కూడిన కేంద్ర సెన్సార్‌బోర్డు వీక్షించి ‘ఏ’ సర్టిఫికెట్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ 16న జారీచేసిందన్నారు. దీన్ని రెండు వారాలపాటు విడుదల చేయడం లేదని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టు కు హామీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అన్ని విధాల పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై దిశ తండ్రి ధర్మాసనానికి అప్పీలు చేశారు.  దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ కమిషన్‌ విచారణను సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సీజే హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యం విచారణను మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ను సవాల్‌ చేస్తూ మరో వ్యాజ్యం వేసుకోవచ్చని పిటిషనర్‌కు సూచించింది. 



Updated Date - 2021-06-15T09:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising