ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరించిన వజ్రం.. కోటీశ్వరుడైన రైతు

ABN, First Publish Date - 2021-05-28T08:08:52+05:30

పొద్దున్నే పొలం పోయిన రైతు మధ్యాహ్నానికి కోటీశ్వరుడయ్యాడు. ఇప్పటి వరకూ సేద్యంలో మిగిలిన అప్పులను ఒక వజ్రం తీర్చేసింది. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పత్తికొండ/తుగ్గలి, మే 27: పొద్దున్నే పొలం పోయిన రైతు మధ్యాహ్నానికి కోటీశ్వరుడయ్యాడు. ఇప్పటి వరకూ సేద్యంలో మిగిలిన అప్పులను ఒక వజ్రం తీర్చేసింది. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతుకు విలువైన వజ్రం దొరకడం.. అది ఏకంగా రూ.1.25 కోట్లకు అమ్ముడు పోవడంతో ఆ అన్నదాత కష్టాలు తీరిపోయాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని చిన్న జొన్నగిరికి చెందిన ఓ రైతు ఎప్పటిలాగే గురువారం పొలం పనులకు వెళ్లాడు. పనుల్లో ఉండగా అతడికి విలువైన వజ్రం దొరికింది. దీంతో స్థానిక వ్యాపారులకు సమాచారం ఇచ్చాడు. ఓ వ్యాపారి వజ్రాన్ని పరిశీలించాడు. మిగిలిన వ్యాపారులకు వజ్రం ఫొటోలను ఫోన్‌ ద్వారా పంపించాడు.


అందరి కంటే ఎక్కువగా ఓ వజ్రాల వ్యాపారి రూ.1.25 కోట్లకు ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్నారు. మార్కెట్‌లో దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని తెలిసింది. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, మదనంతపురం, తుగ్గలి, పెరవలి పరివాహక ప్రాంతాల్లో ఏటా తొలకరి జల్లులు కురవగానే పొలాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. ఇప్పటి వరకు అత్యధికంగా రూ.80 లక్షల విలువైన వజ్రాలు మాత్రమే లభించాయని, రూ.కోటికి పైగా విలువైన వజ్రం లభించడం ఇదే మొదటిసారి అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2021-05-28T08:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising