ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు: పీవీ సింధు

ABN, First Publish Date - 2021-08-04T21:13:29+05:30

అందరి సహకారంతోనే ఒలంపిక్స్‌లో మెడల్ సాధించానని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు తీసుకురావటానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అందరి సహకారంతోనే ఒలంపిక్స్‌లో మెడల్ సాధించానని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు తీసుకురావటానికి కృషిచేస్తానని చెప్పారు. గచ్చిబౌలిలో ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పీవీ సింధు చేరుకుంది. ఈ సందర్భంగా సింధుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఒలింపిక్ పతకం గెలిచాక తొలిసారి హైదరాబాద్‌కు ఆమె వచ్చారు.


టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం కేసీఆర్ అభినందించిన విషయం తెలిసిందే. వరసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు సాధించడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-04T21:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising