ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమ పర్వతంపై తెలుగుతేజం!

ABN, First Publish Date - 2021-01-01T08:35:37+05:30

అది 1140 మీటర్ల ఎత్తైన పర్వతం.. ఎముకలు కొరికే చలి.. అయినా లెక్కచేయని ఆ యువకుడు తన లక్ష్యంపైనే గురి పెట్టారు. చివరికి ఆ పర్వతాన్ని అధిరోహించారు. అంతే కాదు, ఆ పర్వతంపై 108 సార్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్వతంపై 108 సూర్య నమస్కారాలు 

జగిత్యాల జిల్లా వాసి అరుదైన ఘనత 


మెట్‌పల్లి రూరల్‌, డిసెంబరు  31 : అది 1140 మీటర్ల ఎత్తైన పర్వతం.. ఎముకలు కొరికే చలి.. అయినా లెక్కచేయని ఆ యువకుడు తన లక్ష్యంపైనే గురి పెట్టారు. చివరికి ఆ పర్వతాన్ని అధిరోహించారు. అంతే కాదు, ఆ పర్వతంపై 108 సార్లు సూర్యనమస్కారాలు చేసి ఔరా అనిపించారు. ఈ ఘనతను సాధించింది జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్‌ అమెరికాలోని మాట్రిక్స్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ చదువుతున్నారు. పర్వతాల అధిరోహణ ఆసక్తి కలిగిన ప్రవీణ్‌ అమెరికాలో 1140 మీటర్ల ఎత్తులో ఉన్న సోమ పర్వతాన్ని అధిరోహించారు. అంతేకాదు, 3 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 108 సూర్య సమస్కారాలు చేశారు. ఇందుకు ఆయన 22.43 నిమిషాల సమయం తీసుకున్నారు. ప్రవీణ్‌ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 10 పర్వతాలను అధిరోహించారు. 

Updated Date - 2021-01-01T08:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising