ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా విమోచన దినోత్సవం

ABN, First Publish Date - 2021-09-18T06:09:45+05:30

ఘనంగా విమోచన దినోత్సవం

ఆర్డీవో కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేస్తున్న ఏబీవీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భూపాలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సుభా్‌షకాలనీలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ నేతలు భట్టు రవి, దొంగల కుమార్‌, బానోతు రవి తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయంపై ఎగిరిన జాతీయ జెండా 

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ని ర్వహించాలని డిమాండ్‌ చేస్తూ  భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంపై ఏబీవీపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్‌ రాజు, నేతలు వికాస్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రీనాథ్‌, పవన్‌, భూవన్‌, కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో...

ములుగుటౌన్‌ :  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ములుగులో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎమ్డీ.చాంద్‌పాషా,  యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బానోత్‌ రవిచందర్‌, నాయకులు కంబాల రవి, పోలు రవి, మట్టెవాడ తిరుపతి, ఎమ్డీ.షకీల్‌, వంగ రవి, జక్కుల రేవంత్‌  తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో..

బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా పార్టీ జిల్లా కార్యాల యంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్‌ ఆఽధ్వర్యంలో రిటైర్డ్‌ జవానుల సంఘం జిల్లా అధ్యక్షుడు మావురపు అనిల్‌కుమార్‌రెడ్డి, హవాల్‌దార్లు రవీందర్‌, సంతో్‌షతో పాటు ఆదర్శ రైతులు దొంతిరెడ్డి రవిరెడ్డి, శీలమంతుల రవీంద్రాచారి, మల్లెల రాంబాబును  సన్మానించారు.  రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ, నాయకులు అల్లె జనార్దన్‌, రవీంద్రాచారి, వాసుదేవరెడ్డి, జినుకల కృష్ణాకర్‌, యాకూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T06:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising