ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ పోలీసులు

ABN, First Publish Date - 2021-05-11T17:49:34+05:30

హైదరాబాద్: హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడంలేదు. సరిహద్దుల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, రామాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్టు వద్ద రెండో రోజు మంగళవారం ఆంధ్రా నుంచి వచ్చే కోవిడ్ రోగుల అంబులెన్సులను పోలీసులు నిలిపివేస్తున్నారు. ఆస్పత్రి నుంచి అన్ని అనుమతి పత్రాలు చూపించినా పోలీసులు తెలంగాణలోకి అనుమతించలేదని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రి ల్యాండ్‌లైన్ నుంచి పోలీసులకు ఫోన్ చేయిస్తే తప్ప తెలంగాణలోకి ప్రవేశం లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ రోగికి ఏమైనా జరిగితే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి వస్తున్న ఓ కోవిడ్ అంబులెన్సును పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రి పత్రాలు చూపించినా పంపించడంలేదని రోగి బంధువు వాపోయారు. చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్న రోగిని రక్షించాలని వేడుకున్నారు.

Updated Date - 2021-05-11T17:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising