ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఈటల అందుకే వెనక్కి తగ్గారా?

ABN, First Publish Date - 2021-01-16T21:41:48+05:30

కరోనా వ్యాక్సిన్ మొదట తానే వేసుకుంటానని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ మొదట తానే వేసుకుంటానని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ను పారిశుధ్య కార్మికురాలు కృష్ణమ్మ తీసుకుంది. ముందుగా ప్రకటించినట్టు మంత్రి ఈటల ఎందుకు వ్యాక్సిన్ తీసుకోలేదు? ఎందుకంటే... ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జారీచేసిన కఠినమైన మార్గదర్శకాలే కారణమని భావిస్తున్నారు. కరోనా లాంటి కఠినమైన, భయంకరమైన పరిస్థితుల్లో ముందుండి పోరాడిన ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే మొదట టీకా వేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ కఠినమైన సూచనతోనే మంత్రి ఈటల వెనక్కి తగ్గినట్లు సమాచారం. సోమవారం ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగానే మోదీ ఈ సూచనను చేశారు. ‘‘మొదట వ్యాక్సిన్ తీసుకోడానికి రాజకీయ నేతలు క్యూ కట్టకూడదు. వారు విశ్వాసాన్ని ప్రేరేపించడానికి ముందుకు వస్తున్న మాట వాస్తవమే. అయినా... తమ వంతు వచ్చేంత వరకూ రాజకీయ నేతలు వేచి చూడాల్సిందే’’ అని మోదీ నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. 

Updated Date - 2021-01-16T21:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising