ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ కమిటీ ఏం చెబుతుందో చూద్దాం

ABN, First Publish Date - 2021-10-25T08:20:56+05:30

బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై ఓ కమిటీని తెలంగాణ వేసినందున .. ఆ కమిటీ తీసుకునే నిర్ణయం ఏమిటో వేచి చూద్దామని ఏపీ జల వనరుల శాఖ అధికారుల బృందానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణతో సంప్రదింపులు జరుపుతున్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రాజెక్టులు మా అంతట మేం తీసుకోం
  • 2 రాష్ట్రాలూ ఇస్తేనే బోర్డుల స్వాధీనంలోకి
  • ఏపీ అధికారులకు జలశక్తి శాఖ స్పష్టీకరణ


అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై ఓ కమిటీని తెలంగాణ వేసినందున .. ఆ కమిటీ తీసుకునే నిర్ణయం ఏమిటో వేచి చూద్దామని ఏపీ జల వనరుల శాఖ అధికారుల బృందానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోనికి విద్యుత్కేంద్రాలతో సహా ప్రాజెక్టులను తీసుకోవాలని ఏపీ అధికారులు కోరగా.. తమంత తాముగా ప్రాజెక్టులను స్వాధీనంలోకి తీసుకోలేమని తెలిపారని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాలే స్వచ్ఛందంగా అప్పగించాలని.. బలవంతంగా తీసుకోలేం కదా అని జలశక్తి అధికారులు వ్యాఖ్యానించారు. పోలవరం అంచనాలు పెంపుదల.. కృష్ణా , గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి జల విద్యుత్రేంద్రాలు సహా జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు, కాలువలు, కార్యాలయాలు, సిబ్బందిని తీసుకునే విషయంలో కేంద్రం నుంచి స్పష్టత కోసం ఏపీ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లింది.


పోలవరం ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్సు ఇవ్వాలని.. జాతీయ హోదా ప్రాజెక్టులన్నింటికీ ఆమోదిస్తున్న తరహాలోనే ఇందులోనూ తాగు నీటి పథకానికి రూ.4,400 కోట్ల వ్యయానికి ఆమోదం తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ అధికారులను కోరింది. అయితే సానుకూలంగా స్పందించకపోగా.. కేంద్రకేబినెట్‌ ఆమోదించిన రూ.20398.61 కోట్లకు మించి అదనపు వ్యయానికి నిధులు మంజూరు చేయలేమని వారు తేల్చిచెప్పారు.

Updated Date - 2021-10-25T08:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising