ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయిల్‌పామ్‌ సాగుతో నాలుగు రెట్ల ఆదాయం: సీఎస్‌

ABN, First Publish Date - 2021-10-14T09:06:17+05:30

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 5లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 5లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు చర్య లు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఉద్యానవన, పరిశ్రమల శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్ష  నిర్వహించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టాలని కేబినెట్‌ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించినట్లు వివరించారు. వరితో పోలిస్తే ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా 4-5 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చంటూ ఓ అధ్యయ నం ద్వారా తేలిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 నర్సరీలను ఏర్పాటు చేశామని.. వాటి ద్వారా 23.41 లక్షల ఆయిల్‌ పామ్‌ మొలకలు లభించాయని.. 36000 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అవి సరిపోతాయని అధికారులు వివరించారు. 2.11కోట్ల ఆయిల్‌ పామ్‌ మొలకల సరఫరా కోసం వివిధ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 


Updated Date - 2021-10-14T09:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising