ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ: మంత్రి హరీశ్ రావు

ABN, First Publish Date - 2021-01-25T17:28:21+05:30

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలు సోమవారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో ఇక్కడ చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి సీఎం కేసీఆర్ పై విశ్వాసంతో వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పై  ప్రజలు విశ్వాసం‌ కోల్పోయారని ఆయన అన్నారు.


రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ ‌అధికారంలో ‌లేదని, భవిష్యత్తులో రాదని ఆయన తెలిపారు. అందుకే ఆ పార్టీ కార్యకర్తలు , స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు  టీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి  పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ గ్రామంలో చెత్త సేకరణ కోసం వాహనాలు, డంప్ యార్డులు, వైకుంఠ థామాలు, నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. నర్సరీలు,  ప్రకృతి వనాలను ఏర్పాటుతో గ్రామాలు పచ్చగా ఉండేలా చేస్తోందన్నారు.  ప్రతీ నెలా గ్రామాలకు పల్లె ప్రగతి కింద నిధులను ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ రావు అని అన్నారు.

Updated Date - 2021-01-25T17:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising