ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబరు 10 నుంచి 17 వరకు.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు

ABN, First Publish Date - 2021-08-25T09:08:08+05:30

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సెప్టెంబరు 10 నుంచి 17 వరకు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే ని వీరభద్రం 

హైదరాబాద్‌, ఆగస్టు 24( ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సెప్టెంబరు 10 నుంచి 17 వరకు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రతి గ్రామంలో సభలు, ర్యాలీలు ఉంటాయని వెల్లడించారు. బైరాన్‌పల్లి బురుజు, దొడ్డి కొమురయ్య స్థూపం, పోరాట యోధుల స్మారకాలు ఉన్న దగ్గర భారీ ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంగళవారం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విషయంలో బీజేపీ వక్ర భాష్యాలకు పాల్పడడం సరికాదని, ఆ పార్టీ ఆటలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. మోదీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 4న అన్ని గ్రామాల్లో ప్రదర్శనలు, 6న కలెక్టరేట్లు, మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడతామని ప్రకటించారు. దళిత బంధు మాదిరిగా గిరిజన బంధు అమలు చేయాలని పోరాడతామని తమ్మినేని తెలిపారు.

Updated Date - 2021-08-25T09:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising