ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టార్గెట్‌ ‘గులాబీ’!

ABN, First Publish Date - 2021-09-17T09:18:57+05:30

కాంగ్రెస్‌, బీజేపీ.. దారులు వేరైనా, లక్ష్యం ఒక్కటే. రెండు పార్టీలూ తమ అస్త్రాలను ‘గులాబీ’పైనే గురిపెట్టాయి. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ‘దండోరా’ సభ
  • నిర్మల్‌లో బీజేపీ ‘తెలంగాణ విమోచన దినోత్సవ సభ’


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, బీజేపీ.. దారులు వేరైనా, లక్ష్యం ఒక్కటే. రెండు పార్టీలూ తమ అస్త్రాలను ‘గులాబీ’పైనే గురిపెట్టాయి. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.  సీఎం కేసీఆర్‌ పాలనా వైఫల్యాలు, రాజకీయ బలహీనతలను ఎండగట్టడానికి హస్తం, కమలం పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ధ్యేయంతో వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. యాదృచ్ఛికమే అయినప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీలు శుక్రవారం భారీ సభలు నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కాంగ్రెస్‌ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని దళితులతో పాటు గిరిజనులకూ అమలు చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ పార్టీ ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు తలపెట్టింది. ఇక బీజేపీ నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ తలపెట్టింది. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో కమలనాథులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు అమిత్‌ షా హాజరవుతున్నారు. 


ఉప ఎన్నికల ముందు రాజకీయ వేడి..

 కాంగ్రెస్‌, బీజేపీ..  టీఆర్‌ఎ్‌సను టార్గెట్‌ చేస్తూ ఒకే రోజు సభలు తలపెట్టడం రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయంగా లోపాయికారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి అనుకున్నదే తడవుగా అధికార బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం, కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మెచ్చుకుంటుండడం అందుకు ఊతమిస్తోంది. ఈ వాతావరణం ఇక్కడి బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కమలాన్ని అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సంకట స్థితి కల్పించింది. ఈ క్రమంలో శుక్రవారం నిర్మల్‌ సభలో అమిత్‌ షా టీఆర్‌ఎ్‌సని ఉద్దేశించి ఏం మాట్లాడతారనే విషయంపై పార్టీలకతీతంగా ఆసక్తి నెలకొంది. 

Updated Date - 2021-09-17T09:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising