ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లారెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2021-05-08T08:07:04+05:30

మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అక్రమ నిర్మాణాలను కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చండి
  • మల్లారెడ్డి ఆస్పత్రి ముందు ఎన్‌ఎ్‌సయూఐ ఆందోళన
  • దవాఖానా అద్దాలు ధ్వంసం, ఆస్పత్రి పేరు తొలగింపు

జీడిమెట్ల, మే 7 (ఆంధ్రజ్యోతి): మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు డిమాండ్‌  చేశారు. తెలంగాణ రాష్ట్ర సాఽధనలో కొట్లాడిన వారిపై భూ కబ్జా ఆరోపణలు చేసి, మంత్రి పదవుల నుంచి తొలగించిన సీఎం కేసీఆర్‌.. అనేక మంది మంత్రులు వందల ఎకరాలు కబ్జా చేసినా, ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భూ కబ్జాలకు పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సూరారంలోని మల్లారెడ్డి హెల్త్‌ సిటీ ఎదుట ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు, కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి ఆస్పత్రి పేరును తొలగించి, అద్దాలు ధ్వంసం చేశారు. సూరారం చెరువును కబ్జా చేసి నిర్మించిన ఆస్పత్రులు, భవనాలను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుని కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చాలని కోరారు. మల్లారెడ్డి ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మాట్లాడుతూ కొవిడ్‌ రోగుల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు చేపడుతుంటే ఈ తరహా దాడులు చేయడం సరికాదన్నారు. తమ ఆస్పత్రిలో డబ్బులు లేని వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2021-05-08T08:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising