జి-మ్యాట్ పై ఈ నెల 16 నుండి టి-సాట్ స్పెషల్ ప్రొగ్రామ్స్
ABN, First Publish Date - 2021-08-15T22:48:50+05:30
టీ సాట్ నెట్ వర్క్ ఛానళ్లలో 16వ తేదీ సోమవారం నుండి జి-మ్యాట్ (గ్యాడ్యుయేట్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్) పై స్పెషల్ లెసన్స్ ప్రసారం చేస్తున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: టీ సాట్ నెట్ వర్క్ ఛానళ్లలో 16వ తేదీ సోమవారం నుండి జి-మ్యాట్ (గ్యాడ్యుయేట్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్) పై స్పెషల్ లెసన్స్ ప్రసారం చేస్తున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. టి-సాట్ విద్య ఛానల్ లో సోమవారం రాత్రి 9.30 నుండి 10 గంటల వరకు మరుసటి రోజు ఉదయం నిపుణ ఛానల్ లో, 8:30 నుండి 9:00 గంటల వరకు అరగంట పున: ప్రసారాలుంటాయని సీఈవో వివరించారు. ఇప్పటి వరకు ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రసారం చేసిన టి-సాట్ ప్రస్తుతం బిజినెస్ పాఠశాలల విద్యార్థులకూ పాఠ్యాంశ ప్రసారాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జి-మ్యాట్ ప్రసారాల్లో భాగంగా క్యాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశంపై సోమవారం ప్రసారమయ్యే ప్రసారాలు మొదటి విడతలో 30 రోజులు కొనసాగనున్నాయని, వీటిని గ్రాడ్యుయేట్, పోస్టు గ్ర్యాడ్యుయేట్ స్టూడెంట్స్ వినియోగించుకోవచ్చని ప్రధానంగా ఐ.ఎస్.బి., ఐ.ఐ.ఎం., ఎస్.బి.జైన్ వంటి ప్రత్యేక బిజినెస్ స్కూల్ పాఠశాలల్లో ప్రవేశించే విద్యార్థులకు టి-సాట్ ప్రసారం చేసే పాఠ్యాంశాలు ప్రయోజనం చేకూర్చుతాయన్నారు. తెలంగాణ, భారత దేశంలో చదివే విద్యార్థులే కాకుండా విదేశాల్లో చదివే విద్యార్థులూ వీటిని అనుసరించి పోటీ పరీక్షల్లో తమ తమ ర్యాంకింగ్స్ ను మెరుగు పరుచుకునేందుకు జి-మ్యాట్ ప్రసారాలు ఉపయోగపడాయని సూచించారు. ఆంగ్ల బోధనలో జరిగే ప్రసారాలు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లతో పాటు టి-సాట్ వెబ్సైట్, సోషల్ మీడియా పేస్ బుక్, యాప్, యాప్ ప్లే స్టోర్, యూట్యూబ్ లో ప్రసారాలు అందుబాటులో ఉంటాయని గుర్తు చేశారు.
Updated Date - 2021-08-15T22:48:50+05:30 IST