ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై శ్వేతామహంతి తీవ్ర అసంతృప్తి

ABN, First Publish Date - 2021-03-06T13:02:18+05:30

నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బర్కత్‌పుర : నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై కలెక్టర్‌ శ్వేతామహంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చిన వృద్ధులను ఎక్కువ సేపు కూర్చోబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఫీవర్‌ ఆసుపత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధులకు కో వ్యాక్సిన్‌ ఇచ్చే తీరును పరిశీలించారు. వృద్ధులకు మొదటి అంతస్తులో కనీస సౌకర్యాలు లేవన్నారు. పేరు సరిగా నమోదు చేయని రికార్డుల మెయింటెనెన్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌ సిగ్నల్‌ సరిగా లేని చోట కంప్యూటర్‌ను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.


వృద్ధులకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.50 వేల నిధులు కేటాయిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అలాగే... కలెక్టరేట్‌లో శుక్రవారం పిల్లల గ్రోత్‌ మానిటరింగ్‌పై జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 0-5 ఏళ్ల పిల్లల్లో శారీరక అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు లేని ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ చేయాలన్నారు.

Updated Date - 2021-03-06T13:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising