ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాత్మానందేంద్ర సరస్వతితో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ

ABN, First Publish Date - 2021-10-05T02:15:44+05:30

నగరంలోని విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయం ఫిలింనగర్ దైవ సన్నిధానాన్ని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానాన్ని సందర్శించిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు భేటీ అయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ కూడా అయిన మోహన్‌బాబు ఈ సందర్భంగా ఆలయాభివృద్ధికి చేపడుతున్న చర్యలపై స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో చర్చించారు.


ఈ  ఉదయం దైవ సన్నిధానాన్ని సందర్శించిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాలు, ఆగమ విధానాలపై అర్చకులు, పండితులతో చర్చించారు. ప్రత్యేక హోమాలు, పూజల ద్వారా భక్తులకు చేరువ కావాలని, దసరా నవరాత్రుల్లో, కార్తీక మాసంలో వైభవోపేతంగా చేపట్టాలని సూచించారు.


విశిష్టమైన వైదిక కార్యక్రమాలను ఏటా చేపట్టేలా ప్రణాళిక రచించాలన్నారు. ఆలయాభివృద్ధికి అర్చకులంతా సమష్టి కృషి చేయాలని సూచించారు. కాగా, మోహన్‌బాబు కుమారుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. పోటీ నుంచి సీవీఎల్‌  తప్పుకోవడంతో ‘మా’ అధ్యక్ష పదవి కోసం  ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. 

Updated Date - 2021-10-05T02:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising