ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భూ భారతి’కి స్వస్తి!

ABN, First Publish Date - 2021-05-19T09:21:27+05:30

భూముల సమగ్ర సర్వే కోసం ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్‌లో ప్రారంభించిన ‘భూ భారతి’ ప్రాజెక్టు ప్ర స్థానం ముగిసిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): భూముల సమగ్ర సర్వే కోసం ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్‌లో ప్రారంభించిన ‘భూ భారతి’ ప్రాజెక్టు ప్ర స్థానం ముగిసిపోయింది. ఈ ప్రాజెక్టును ఎత్తివే స్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇందులో పనిచేస్తున్న సిబ్బందిని మాతృశాఖలకు పంపించేశారు. పనిలో పనిగా సర్వే సెటిల్మెంట్‌ క మిషనరేట్‌లో ఉన్న జాయింట్‌ డైరెక్టర్‌ (భూ భార తి) పోస్టును కూడా రద్దు చేశారు. భూముల సరిహద్దులన్నీ పక్కాగా కొలిచి... ప్రతీ భూమిని సర్వే చేసి, భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికి వీలుగా 2006 మే1న భూ భారతి ప్రాజెక్టును నిజామాబాద్‌లో  ప్రభుత్వం ప్రారంభించింది. 


దీనికింద జిల్లాలో 911 గ్రా మాల్లో భూముల సర్వే పూర్తి చేశా రు. ఇక 390 గ్రామాల్లో భూ వివాదాలు/అభ్యంతరాలను పరిశీలించి... 60 గ్రామాల భూ రికార్డులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చా రు. మరో 171 గ్రామాల భూముల రికార్డులకు కూడా నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. అయితే ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో నోటిఫికేషన్‌ ఆగిపోయింది. వాస్తవాని కి ఆర్నెల్ల పాటు దీనిపై  పూర్తిస్థాయిలో దృష్టి సా రించి, ప్రత్యేక డ్రైవ్‌ చేపడి తే నిజామాబాద్‌ జిల్లా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికేది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రా జెక్టులో పెద్దగా కదలిక లేకుండా పోయింది. వాస్తవానికి అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి డిజిటల్‌ ల్యాండ్‌ రికార్డ్‌ మోడ్రనైజేషన్‌ ప్రోగ్రామ్‌(డీఎల్‌ఆర్‌ఎంపీ)నిధులను కూడా వాడుకునే అవకాశాలుండేవి. అయితే ఆ పని చేయడానికి యం త్రాంగం సిద్ధంగా లేదు. దాంతో ప్రాజెక్టును మూసేశారు. 

Updated Date - 2021-05-19T09:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising