ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చారిత్రక గోల్కొండలో స్వచ్ఛతా పఖ్వాడా

ABN, First Publish Date - 2021-09-30T21:54:54+05:30

భారత ప్రభుత్వం పారిశుద్యం, పరిశుభ్రతపై దృష్టి సారించదానికి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 2016లో దేశవ్యాప్తంగా "స్వచ్ఛతా పఖ్వాడా" రూపంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారత ప్రభుత్వం పారిశుద్యం, పరిశుభ్రతపై దృష్టి సారించదానికి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 2016లో దేశవ్యాప్తంగా "స్వచ్ఛతా పఖ్వాడా" రూపంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని పలు సందర్భాల్లో నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగానే గురువారం నగరంలోని చారిత్రక గోల్కొండ కోటలో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు ఇతర శాఖలు  కలిసి స్వచ్చతా పఖ్వాడా నిర్వహించారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛతా పఖ్వాడా అనేది స్వచ్ఛతా కార్యక్రమాలలో పౌరుల భారీ భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి స్వచ్ఛ భారత్‌ను పౌరుల ఉద్యమంగా మార్చడానికి పక్షం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంగా అధికారులు పేర్కొన్నారు. 


స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్చతా పఖ్వడాను నిర్వహిస్తున్నారు. స్వచ్ఛత పఖ్వాడా ద్వారా స్వచ్ఛత సంబంధిత కార్యకలాపాలలో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను భాగస్వాములను చేసి తద్వారా స్వచ్ఛతను "అందరి భాగస్వామ్యం" గా మార్చారు. అందులో భాగంగా పర్యాటక కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వలన దేశీయ, విదేశీయ పర్యాటకులను ఆకర్శించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ"స్వచ్ఛతా పఖ్వాడా" కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆదేశానుసారం సెప్టెంబర్ 16 న ప్రారంభమై 30వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం జీహెచ్ఎంసి,భారత పురావస్తు సర్వే, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, భారత పర్యాటక శాఖ, నితిమ్, ఐ.హెచ్.ఎం. వీరందరి సౌజన్యంతో "స్వచ్ఛతా పఖ్వాడా"ను గురువారం గోల్కొండ కోటలో నిర్వహించారు. 

Updated Date - 2021-09-30T21:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising