ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ రంగుల వలయం

ABN, First Publish Date - 2021-06-02T18:42:08+05:30

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. సుమారు గంట పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. సుమారు గంట పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూడ్డానికి జనం నగరంలో పలు చోట్ల గుమిగూడారు. తమ మొబైల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు. నగరంతో పాటు తాండూరు తదితర ప్రాంతాల్లోనూ వలయాకార దృశ్యాలు కంటపడ్డాయి.


ఫొటోల కోసం క్లిక్ చేయండి


గత నెలలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీన్ని సన్ హాలో అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచిక అంటారు. 


ఇదిలా ఉంటే, సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని  బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని “22-డిగ్రీ హలోస్” అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు.



Updated Date - 2021-06-02T18:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising