సబ్సిడీ విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి : ట్రాన్స్‌కో డీఈ
ABN, First Publish Date - 2021-12-31T19:32:08+05:30
దళిత కాలనీలు, గిరిజన తండాలకు చెందిన ప్రజలు సబ్సిడీ విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ మృత్యుంజయరావు ఒక ప్రకటనలో సూచించారు.
నర్సంపేట, డిసెంబరు 30 : దళిత కాలనీలు, గిరిజన తండాలకు చెందిన ప్రజలు సబ్సిడీ విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ మృత్యుంజయరావు ఒక ప్రకటనలో సూచించారు. దళితకాలనీలు, గిరిజన తండా ల్లోని వినియోగదారులు సబ్సిడీ మీటర్లను బిగించి విద్యుత్‌ను వాడుకోవాలని కోరా రు. ప్రభుత్వం నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వాడుకునేందుకు రాయి తీ కల్పించిందని వివరించారు. మీటర్లు లేకుండా విద్యుత్‌ను వాడుకోవడం నేరమని, విద్యుత్ చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉచిత మీటర్ల కోసం మీసేవ కేంద్రంలో రూ.970 చెల్లించి కుల ఽధ్రవీకరణ పత్రం సమర్పించి దరఖాసుచేసుకోవాలని ఆయన సూచించారు.
Updated Date - 2021-12-31T19:32:08+05:30 IST