ఘన్‌పూర్‌లో మెరిసిన తెల్లబంగారం
ABN, First Publish Date - 2021-12-31T05:40:51+05:30
ఘన్‌పూర్‌లో మెరిసిన తెల్లబంగారం
వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి క్వింటా రూ.8810 ధర
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్, డిసెంబరు 30 : స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో గురువారం పత్తికి అధిక ధర లభించింది. మద్దతు ధర క్వింటాకు రూ.6025లు కాగా, రైతులకు గరిష్ఠంగా రూ.8810, కనిష్ఠ ధర రూ. 8370 పలికింది. 25 మంది రైతులు 30 క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా.. ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువరేటు పలకడంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేశారు. అక్టోబరు నెల మొదట్లో పత్తికి గరిష్ఠ ధర రూ. 7500, కనిష్ఠం రూ.6400 లభించిందని మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు తెలిపారు. రోజులుగా వరంగల్ మార్కెట్‌తో సమానంగా క్వింటాల్‌కు రూ.9000 గరిష్ఠధర, రూ.8300 కనిష్ఠ ధర పలుకుతుండడం విశేషమన్నారు. రెండురోజుల క్రితం పత్తికి ఘన్‌పూర్ మార్కెట్‌లో క్విం టాల్‌కు రూ.9000 ధర లభించిందన్నారు. మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చంద ర్‌రెడ్డి,మార్కెట్ కార్యదర్శి జీవన్‌కుమార్, డైరెక్టర్లు చిగురు సరిత, ఆంజనేయులు, జొన్నల సోమేశ్వర్, ట్రైడర్లు గోలి శ్రీనివాస్, ప్రకాశం, శ్రీనివాస్, సిబ్బంది టి.శ్రీనివాస్, అశోక్, డేవిడ్ పాల్గొన్నారు.
Updated Date - 2021-12-31T05:40:51+05:30 IST