ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు చోట్ల వడగళ్ల వర్షాలు

ABN, First Publish Date - 2021-04-22T07:36:26+05:30

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం వడగళ్ల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నేలరాలిన వరి, మామిడికాయలు
  • కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
  • సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి


(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం వడగళ్ల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో ఈదురు గాలులు, వడగళ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యంలో 500 క్వింటాళ్ల వరకు తడిసిపోయింది. కొంత కొట్టుకుపోయింది. మండలంలో పలు చోట్ల కోతకు సిద్ధంగా ఉన్న ధాన్యం నేలరాలి పోయింది. అలాగే కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పెంచికలపేట మండలంలో ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురవడంతో మామిడి కాయలు నేలరాలాయి. సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షానికి మామిడి కాయలు రాలిపోవడంతో పాటు ధాన్యం తడిసింది. నడిగూడెం మండలంలో పిడుగుపాటుకు 20 మేకలు చనిపోయాయి. హుజూర్‌నగర్‌ మండలం శ్రీనివాసపురం, అమరవరం, వేపలసింగారం గ్రామాల్లో వడగళ్ల వానకు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఎ చివెంల మండలం మొగ్గాయగూడెం గ్రామంలో హరిశ్చంద్ర అనే రైతు పిడుగుపాటుకు గురై మరణించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది.  శంకరపట్నం మండలంలో పలు గ్రామాల్లోని కళ్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్‌, వలిగొండ మండలాల్లో మంగళవారం కురిసిన వడగండ్ల వానలకు 2,645 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని వ్యవసాయాధికారులు తెలిపారు. చౌటుప్పల్‌ మండలంలో వడగండ్ల వానకు 1,680ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.


రెండు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30- 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి కర్ణాటక వరకు ఏర్పడినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-04-22T07:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising