ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజకవర్గానికో క్రీడా మైదానం: శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2021-01-18T08:56:05+05:30

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామని క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, జనవరి 17: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామని క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. తెలంగాణలో 100 స్టేడియంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 40 పూర్తయ్యాయన్నారు. పాలమూరులో ఐదురోజుల పాటు కొనసాగిన ఎయిర్‌షో అండ్‌ పారామోటార్‌ చాంపియన్‌షి్‌ప పోటీలు ఆదివారం ముగిశాయి. పారామోటార్‌ చాంపియన్‌షి్‌పలో హరియాణకు చెందిన పైలట్‌ నితిన్‌కోబాల్‌ ఆల్‌ ఓవర్‌ విన్నర్‌గా నిలిచారు. ట్రాక్‌ విన్నర్‌గా హిమాత్‌ ఫారూఖీ, సోలో పారామోటార్‌ విన్నర్‌గా తమిళనాడుకు చెందిన పైలట్‌ సత్యనారాయణ నిలిచారు. ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో ఏడాదిలోగా పారామోటార్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 


కేవీల్లో టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలి: వినోద్‌

రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయాల ప్రతిపాదనలకు మోక్షం కలిగించాలన్నారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు ఆయన ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో 1,218 టీచర్ల పోస్టులు మంజూరు కాగా, అందులో 959 రెగ్యులర్‌, 131 కాంట్రాక్టు పోస్టులని వివరించారు. వాటిలో 128 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-18T08:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising