ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదప్రజలే టీఆర్ఎస్‌కు దేవుళ్లు: శ్రీనివాస్‌గౌడ్

ABN, First Publish Date - 2021-08-31T22:09:40+05:30

పేదప్రజలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి దేవుళ్లని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: పేదప్రజలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి దేవుళ్లని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మంత్రి  సమక్ష్యంలో బోయపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు  టీఆర్ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి నిరోధకులు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు గుర్తింపునిచ్చే స్వభావం టీఆర్ఎస్‌దని చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్నివర్గాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయన్నారు హైదరాబాద్‌కు ధీటుగా మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేసి తీరుతామన్నారు. ఇక్కడి ఆస్తులకు, భూములకు ధరలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వారి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ప్రతీ గ్రామంలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశామలం చేస్తామని వ్యాఖ్యానించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను మరో కోనసీమగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

Updated Date - 2021-08-31T22:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising